చండీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే…
జ్ఞాన సరస్వతి దేవాలయంలో వైభవంగా మహా చండీ హోమం
15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండీ, దత్తాత్రేయ హోమాలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
నాగర్ కర్నూల్, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): జ్ఞాన సరస్వతి దేవాలయంలో వారు 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు గురువారం నాడు మహా చండీ హోమం, దత్తాత్రేయ హోమం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించినట్లు దేవాలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం తెలిపారు. వేద పండితులు పట్నం సురేష్ శర్మ అర్చక బృందంతో కలిసి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండాలలో వేదమంత్రోచ్ఛారణల నడుమ మహా చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో ఆకారపు విశ్వనాథం–ప్రభావతి, లగిశెట్టి జగదీశ్వరయ్య–వరలక్ష్మి దంపతులతో పాటు 21 మంది దంపతులు ఉన్నారు. చండీ అమ్మయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని ఆయన, మహా చండీ హోమం చేయడం ద్వారా శత్రువనాశనం, సర్వాభీష్టాల ప్రాప్తి, అష్ట ఐశ్వర్యాల సిద్ధి కలుగచేసింది. అలాగే దత్తాత్రేయ హోమం చేయడం వల్ల గురుబలం పెరిగి కోరిన కోరికలు నెరవేరాయి. మాఘమాసంలో అమ్మవారిని కొలవడం ఎంతో పుణ్యఫలితాన్ని ఇస్తోంది. ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ పవన్ శర్మ, గోపాల్ శర్మలు గణపతి పూజ, నవగ్రహ పూజలతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమాలను వేదమంత్రాలతో నిర్వహించారు. జన్మ నిత్య, గోచార రీత్యా గ్రహశాంతి కోసం నవగ్రహ హోమాన్ని ప్రకటించారు. జ్ఞానసరస్వతి పారాయణ కమిటీ సభ్యులు లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం భక్తులు సామూహికంగా పఠించారు. అనంతరం ఆలయ ఆవరణలో అమ్మవారికి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ శుక్రవారం మాఘమాస వసంత పంచమి సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాంతంలోని చిన్నారులు తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని. అక్షరాభ్యాసాలు, పూజల కోసం 9441303182, 9949031319 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు వలిశెట్టి లక్ష్మిశేఖర్, ఇందుమతి, పాండురంగయ్య, బాలస్వామి, నారాయణ రెడ్డి, శారదమ్మ, శివశంకర్, ఈశ్వర్ రెడ్డి, రవికుమార్, భూపాల్ రెడ్డి, శివకుమార్, నవీన్ కుమార్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.




