సామాజిక న్యాయ సాధనకే జేఏసీ ఏర్పాటు
మండల అధ్యక్షుడు కేవీ మధు
బాలానగర్, జనవరి 17 (మనఊరు ప్రతినిధి): సామాజిక న్యాయ సాధన లక్ష్యంగానే మండల స్థాయిలో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు కె.వి. మధు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జేఏసీ మండల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కె.వి. మధు, ప్రధాన కార్యదర్శిగా పబ్బ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా చిల్ల వెంకటేష్ ముదిరాజ్, కార్యదర్శులుగా ఏల కృష్ణయ్య, రాగిడి రాంప్రసాద్, కోశాధికారిగా లచ్చి రామ్ నాయక్, కో-కన్వీనర్‌గా రవి నాయక్‌లను నియమించినట్లు తెలిపారు. అదనంగా మరో 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ జేఏసీ ద్వారా అందుచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని మధు స్పష్టం చేశారు. రాష్ట్ర డి.ఎస్.పి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ స్ఫూర్తితోనే ఈ జేఏసీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

