వనపర్తిలో కోతులు
కుక్కల బెడదతో ప్రజల అవస్థలు
బెడద నివారిస్తేనే మా ఓటు
మున్సిపల్ అభ్యర్థులకు పట్టణవాసుల హెచ్చరిక
వనపర్తి, జనవరి 17 (మన ఊరు దినపత్రిక): వనపర్తి జిల్లా జిల్లా కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఇళ్లపైకి ఎక్కి వస్తువులు ఎత్తుకెళ్లడం, వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు చూస్తున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే ప్రతి అభ్యర్థి కోతులు, కుక్కల బెడద నివారణపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. “మాకు ఈ సమస్యను పోగొట్టిన కౌన్సిలర్‌కే ఈసారి వేసి గెలిపిస్తాం” అని పట్టణ ప్రజలు గుంటగట్టిగా ఓటు వేశారు. మున్సిపల్ పాలకులు, అధికారులు వెంటనే స్పందించి పట్టణ ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
