రమేష్ గుప్త కుటుంబాన్ని పరామర్శించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కలిమిచెర్ల రమేష్ గుప్త కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శుక్రవారం పట్టణంలోని రమేష్ గుప్త నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ గుప్తకి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ సమయంలో మనోధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఈ విషాద సంఘటన వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షులు శ్రీధర్ గుప్త, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు యూసుఫ్ బాబా, శ్రీపతి, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
