ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం…
ప్రధాన రహదారిపై తాత్కాలిక మరమ్మత్తులు
ఖిల్లా ఘన్‌పూర్ సర్పంచ్ అగారం పద్మమ్మ–ప్రకాష్ చొరవ అభినందనీయం
ఖిల్లా ఘన్‌పూర్, జనవరి 9 (మన ఊరు ప్రతినిధి): ఖిల్లా ఘన్‌పూర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన గ్రామ సర్పంచ్ అగారం పద్మమ్మ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టారు. మండల కేంద్రం నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే ఈ రహదారి గత కొంతకాలంగా గుంతలమయమై ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజా క్షేమాన్ని ప్రధానంగా తీసుకుని గుంతలలో మట్టిని పోయించి రహదారిని చదును చేయించారు.
ఈ తాత్కాలిక చర్యల వల్ల
గుంతల కారణంగా జరిగే చిన్న చిన్న ప్రమాదాలకు అడ్డుకట్ట పడింది, వాహనదారులకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడింది, శాశ్వత రహదారి పనులు ప్రారంభమయ్యే వరకు ప్రయాణికులకు ఉపశమనం లభించింది. ఈ చిన్నదైనా ప్రజాప్రయోజనకరమైన చర్యతో బాధ్యతగా స్పందించిన సర్పంచ్ అగారం పద్మమ్మ గారికి, ప్రకాష్ గారికి, అలాగే సహకరించిన గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సంబంధిత శాఖ అధికారుల ద్వారా బీటీ రోడ్డు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. రహదారిపై మట్టి పోసిన కారణంగా దుమ్ము వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

