మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి
ముగ్గుల పోటీల్లో ఐద్వా జిల్లా కార్యదర్శి కె.గీత పిలుపు
నాగర్‌కర్నూల్, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రం 23వ వార్డు రాఘవేంద్ర కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత హాజరై మాట్లాడారు. మహిళలు, పిల్లల్లో అపారమైన సృజనాత్మక శక్తి ఉంటుందని, దాన్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే ఈ తరహా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం అంటూ ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను మహిళలంతా ఐక్యంగా వ్యతిరేకించాలని. పేద కుటుంబాలకు చెందిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వాలు అందించాలని సహా. అలాగే సమాన పనికి సమాన వేతనం మహిళలకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గృహిణులు ఇంట్లో చేస్తున్న అపారమైన శ్రమను కుటుంబాలు, సమాజం, ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. మహిళల హక్కులతో పాటు నిబంధనల ప్రకారం అమలు చేయడం, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కుతో భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలనుకునే మనువాద ఆలోచనలను మహిళలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని. ఈ ముగ్గుల పోటీలకు నిర్మల టీచర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు, కాలనీవాసులు అంజనమ్మ, నవనీత, స్వాతి, మల్లీశ్వరి, యామిని, ఉమ, ఉష, శ్రీదేవి తర్వాత ఉన్నారు.

