మాచారం బస్సు ప్రమాద బాధితులకు పరామర్శించిన అదనపు కలెక్టర్

 మాచారం బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ

సీఎం పర్యటన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ పరిశీలన

జడ్చర్ల రూరల్, మహబూబ్‌నగర్, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సభా వేదిక, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లను మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌తో పాటు సిబ్బందితో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే చిట్టి బోయిన్‌పల్లి వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలాన్ని ఆర్‌అండ్‌బీ డీఈ, ఏఈలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇక త్రిబుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన భూమి చదును పనులు, భూమి పూజకు అవసరమైన ఏర్పాట్లను ఈడబ్ల్యూఐడీసీ డీఈ, ఏఈలతో కలిసి పరిశీలించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా వేగంగా పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.







Previous Post Next Post