పాలెం వెంకన్న దేవాలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణోత్సవం...

 పాలెం వెంకన్న దేవాలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణోత్సవం...

ముగిసిన ధనుర్మాస ప్రత్యేక పూజలు...

సెప్టెంబర్ 20 నుండి 27 వరకు పాలెం దేవాలయ బ్రహ్మోత్సవాలు...


బిజినపల్లి, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నాడు భోగి సందర్భంగా గోదాదేవి రంగ నాయక స్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది.గత నెల రోజులుగా దేవాలయంలో జరిగిన ధనుర్మాస ప్రత్యేక పూజలు పూసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజా చార్యులు తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున గోవింద నామస్మరణతో గోవింద నామాలతో మార్మోగింది.చివరి రోజు అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం నిర్వహించడం జరిగింది.ఆలయ ధర్మకర్త మనుసాని విష్ణుమూర్తి ఆలయ ఈవో సిహెచ్ రంగారావు పర్యవేక్షణలో అర్చకులు జయం,శుక్ల, వేణుగోపాల్,చక్రవర్తి లు వేదమంత్ర చరణాల మధ్య కళ్యాణం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు గోదా దేవి కళ్యాణానికి విచ్చేటువంటి భక్తులకు అన్నప్రసాదనీ సొప్పరి రాములు కృష్ణమ్మ దంపతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బండారుజగదీష్ దేవాలయ సిబ్బంది బాబయ్య,శివ కుమార్,పురుషోత్తం,భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.
 





Previous Post Next Post