అయ్యప్ప ఇరుముడి ప్రత్యేక పూజల్లో కాంగ్రెస్ సీనియర్ నేత టీ. సాయి చరణ్ రెడ్డి
ఖిల్లా ఘనపూర్, జనవరి 7 (మన ఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధానంలో నిర్వహించిన ఇరుముడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీ. సాయి చరణ్ రెడ్డి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అగారం చెన్నయ్య గురు స్వామి ఆధ్వర్యంలో శేఖర్ స్వామి, శశివర్ధన్ రెడ్డి స్వామిల ఇరుముడి పూజలు ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీ. సాయి చరణ్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా, భక్తి, క్రమశిక్షణ, సహనం వంటి గుణాలను పెంపొందించే ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో అయ్యప్ప సన్నిధానం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘనపూర్ మాజీ ఎంపీపీ క్యామా వెంకటయ్య, మండల నాయకులు అగారం ప్రకాష్, వనపర్తి జిల్లా దిశ కమిటీ సభ్యులు రవి నాయక్, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, బండారి యాదగిరి, కాగితల మధు తదితరులు పాల్గొన్నారు.
