ఘనంగా కేతేపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
గ్రామ మహిళల రంగురంగుల ముగ్గులతో పండుగ శోభ
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కేతేపల్లి గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గ్రామ సర్పంచ్ భూతగాళ్ల రమేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రజా వైద్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పగిడాల శ్రీనివాస్ ఈ సందర్భంగా గ్రామ మహిళలు, యువతులు వేసిన రంగురంగుల ముగ్గులను ఆయన పరిశీలించి అభినందించారు. మకర సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు. కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్ భూతగాల్ల రమేష్ డాక్టర్ పగిడాల శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఎఐఐసీ జాతీయ ఓబిసి నాయకులు డాక్టర్ కేతూరి వెంకటేష్, గ్రామ ఉపసర్పంచ్ కృష్ణవేణి, మాజీ సర్పంచ్ రాజు, మాజీ సింగిల్ విండో జైపాల్, అన్వేష్, రామకృష్ణ, అంజి, లక్ష్మణ్, పెద్ద బీరయ్య, చిన్న బీరయ్య, చిన్న గోపాల్, రాజేష్, ఆనంద్ రెడ్డి, తాళ్ల కృష్ణ, గూడెం డైరెక్టర్ రాముడు, అక్కల చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.





