ఘనంగా ఉమామహేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం

 ఉమామహేశ్వర ఆలయానికి భక్తుల ప్రభ

ఘనంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం

అచ్చంపేట, జనవరి 15 (మనఊరు ప్రతినిధి): పవిత్రమైన హిందూ బంధువులు ఉమామహేశ్వర టెంపుల్ దేవస్థానానికి బయలుదేరిన ప్రభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అనురాధ, పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, ఐఎన్‌టీసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉమామహేశ్వర ఆలయ దర్శనానికి బయలుదేరిన ప్రభలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక శోభను పెంపొందించారు.

Previous Post Next Post