ఘనంగా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

 ఘనంగా ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

జిల్లా నలుమూలల నుంచి భక్తుల భారీ రాక


కల్వకుర్తి, జనవరి 18 (మనఊరు ప్రతినిధి జిల్లా): నాగర్ కర్నూల్, కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో గల ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జనవరి 17 నుండి 4 వరకు 2 వారం రోజులపాటు నిర్వహించబడిన ఆలయ కమిటీ సభ్యులు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా పబ్బతి ఆంజనేయ స్వామి వారికి భక్తులలో అపారమైన విశ్వాసం ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 










Previous Post Next Post