అంగరంగ వైభవంగా తిరుపతి స్వామి స్వగృహంలో మహా పడిపూజ

 అంగరంగ వైభవంగా తిరుపతి స్వామి స్వగృహంలో మహా పడిపూజ

రాజాపూర్ మండలం, జనవరి 19 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో తిరుపతి స్వామి స్వగృహంలో ఆదివారం ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన శివ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా శివునికి వివిధ రకాల పుష్పాలతో అర్చనలు నిర్వహించడంతో పాటు పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. భక్తుల శివనామస్మరణతో కార్యక్రమ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది. ఈ మహా పడిపూజ కార్యక్రమం ధ్యాసమునీ కృష్ణయ్య గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, శివ స్వాములు భాస్కర్ స్వామి, కేశవులు, నర్సింలు, గణేష్, తిరుపతి, లాల్ సింగ్, శంకర్ నాయక్, హరికృష్ణ, ప్రశాంత్, హతిరాం నాయక్, విష్ణు స్వామి, సత్యం స్వామి, రవి స్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల పెద్దలు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ కూడా హాజరై కార్యక్రమానికి ఘనత చేకూర్చారు. అధిక సంఖ్యలో శివ స్వాములు, భక్తులు పాల్గొనడంతో ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.



Previous Post Next Post