మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

 మాదే జంగయ్య కుటుంబానికి హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సహాయం

కల్వకుర్తి రూరల్, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామానికి చెందిన మాదే జంగయ్య ఇటీవల మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా జంగయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుటుంబానికి రూ.10,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కష్టసమయంలో ఫౌండేషన్ అందించిన ఈ సహాయం కుటుంబానికి కొంత ఊరట కలిగించిందని గ్రామస్తులు తెలిపారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, అవసరంలో ఉన్న కుటుంబాలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

Previous Post Next Post