సీసీ రోడు డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్

 గోప్లాపూర్‌లో రూ.25 లక్షల సీసీ రోడ్లు

అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

జడ్చర్ల రూరల్, జనవరి 22 (మన ఊరు ప్రతినిధి): మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆశీస్సులతో రూ.25 లక్షల నిధులతో 8వ వార్డులో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ పనులను. గ్రామ అభివృద్ధి దిశగా ఈ పనులు పూర్తయితే స్థానికులకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివార్దిని నమ్మ, మార్కెట్ డైరెక్టర్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్ చెన్నయ్య, గ్రామ సెక్రటరీ శివ, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు అందించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సర్పంచ్‌తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనుల ద్వారా రాకపోకలు సులభతరం కావడంతో పాటు, శుద్ధ్యం మెరుగుపడుతుందని వారు ప్రకటించారు.

Previous Post Next Post