శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అక్షరాభ్యాస, అన్నప్రాసలు
చిన్నారులతో కళకళలాడిన జ్ఞాన సరస్వతి దేవాలయం
భీష్మ ఏకాదశి వేళ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు
అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు… భక్తుల సందడి
నాగర్‌కర్నూల్, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తిశ్రద్ధలతో అక్షరాభ్యాసాలు, అన్నప్రాస కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఆలయంలో ప్రతిరోజూ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసలు, మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పి.ఎం.శ్రీ పథకంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉప్పునుంతల విద్యార్థులు అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు దొడ్ల నారాయణరెడ్డి, దొడ్ల ఇందుమతి, భూపాల్ రెడ్డి, అల్లంపల్లి శివకుమార్, నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

