ఇస్రోలో మరికల్ విద్యార్థుల విజ్ఞాన విహారం

 ఇస్రోలో మరికల్ విద్యార్థుల విజ్ఞాన విహారం 

శ్రీహరికోట శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష అవగాహన

మహబూబ్ నగర్, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): మరికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా ఇస్రో (శ్రీహరికోట) పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి అరుదైన అనుభవాన్ని పొందారు. మరికల్ ఉన్నత పాఠశాల నుండి 100 మంది విద్యార్థులు బుధవారం నాడు బయలుదేరి బీచ్‌పల్లి, అలంపూర్ దేవాలయం సందర్శన అనంతరం శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా అక్కడి శాస్త్రవేత్తలు విద్యార్థులకు రాకెట్ తయారీ విధానం, పరిశోధన ప్రక్రియ, ప్రయోగ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే విధానం తదితర అంశాలపై సవివరంగా వివరించారు. శాస్త్రవేత్తల ప్రత్యక్ష వివరణలతో విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ విలువైన విజ్ఞానాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజ్ఞాన విహార యాత్రలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సరస్వతి, ఉపాధ్యాయులు మల్లప్ప, వెంకటయ్య, అంజిలయ్య, శివప్రసాద్, రాజు, హనుమయ్య, శశిధర్, రత్నమాల, మనీషా, పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post