సంక్రాంతి పండుగకు నవాబుపేటలో జెకె ట్రస్ట్ ఆర్థిక సహాయం
2863 మందికి రూ.500 చొప్పున పంపిణీ
నవాబుపేట, జనవరి 14 (మన ఊరు ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నవాబుపేట గ్రామ ప్రజలకు జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ నెల 13 నుంచి 14 వరకు రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో పండుగ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం 2863 మంది లబ్ధిదారులకు నగదు సహాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెకె ట్రస్ట్ చైర్మన్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మండల ఏఎంసీ చైర్మన్ వి. నరసింహ చారి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజలు, అవసరమైన వర్గాల సంక్షేమానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ఈ ఆర్థిక సహాయంపై హర్షం వ్యక్తం చేస్తూ, జెకె ట్రస్ట్ సేవలను ప్రశంసించారు.









