యువకుడు శ్రీనాథ్ నాయక్ మృతి బాధాకరం

 యువకుడు శ్రీనాథ్ నాయక్ మృతి బాధాకరం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి

కల్వకుర్తి, మాడ్గుల, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): మాడ్గుల మండలంలోని బావోజీ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిలాల్ నాయక్ కుమారుడు శ్రీనాథ్ నాయక్ (25) అనారోగ్యంతో మృతి చెందడం తీవ్రంగా బాధాకరమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనాథ్ నాయక్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరిలాల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యువకుడి అకాల మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కపల్లి, బావోజీ తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post