వెల్దండ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం
సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
వెల్దండ, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): వెల్దండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తెలిపారు. బుధవారం వెల్దండ గ్రామపంచాయతీ పరిధిలోని 9వ వార్డులో వార్డు సభ్యులు ముదిగొండ కవిత–రమేష్లతో కలిసి సర్పంచ్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పేరుకుపోయిన ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే తమ ధ్యేయమని అన్నారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి, దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచ్ ఎర్ర శీను ముదిరాజ్, పురుషోత్తమాచారి, పుల్లయ్య, క్రిస్టల్, మట్ట నాగేశ్వర్ గౌడ్, గోసుల కొండలు, ఖలీల్, తరుణ్, మట్ట భరత్ గౌడ్, వేణు కుమార్, రామకృష్ణ, నాగార్జున గౌడ్, పంచాయతీ కార్యదర్శి గిరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
