మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా భాగ్యమ్మ

 వెల్దండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

వెల్దండ, జనవరి 8, 2026 (పయనించే సూర్యుడు / కల్వకుర్తి ప్రతినిధి): వెల్దండ మండల కేంద్రంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్ష పదవికి ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. బుధవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు మర్రిగుంత తండా సర్పంచ్ భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్‌ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ గారితో పాటు ఫూల్ సింగ్ గారిని శాలువాలతో సన్మానించారు. మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి – బండోనిపల్లి సర్పంచ్ శమల్ల అనూష కృష్ణ, పెద్దాపూర్ సర్పంచ్ తిరుగుడు మంజుల రాజు యాదవ్, బైరాపూర్ సర్పంచ్ ప్రధాన కార్యదర్శిగా గున్నెళ్ళ శ్రీనివాస్, మండలంలోని 32 గ్రామపంచాయతీల సర్పంచులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.

Previous Post Next Post