బైరాపూర్ సైదులు దర్గా గంధోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సుంకిరెడ్డి

 బైరాపూర్ సైదులు దర్గా గంధోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలు  చేసిన సుంకిరెడ్డి

కల్వకుర్తి, వెల్దండ, జనవరి 23 (మనఊరు ప్రతినిధి):వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గల సైదులు దర్గా ఉర్సు జాతర, గంధోత్సవం సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా సైదులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని దర్గా కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గతంలో సైదులు దర్గా ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టిన విషయాన్ని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post