నేడు కోకాపేటలో రాష్ట్ర స్థాయి వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘ ప్రమాణ స్వీకారం
నాగర్ కర్నూల్, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కోకాపేటలోని వీరశైవ లింగాయత్ బసవ భవన్, సంఘ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి కేంచే రాజేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 2026 సంవత్సరానికి నూతనంగా ఎంపికైన జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి నూతన కమిటీ సభ్యులు, ఇటీవల ఎంపికైన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే లింగబలిజ, బలిజ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
