శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలు ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలి

 శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలు ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలి

టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు

భక్తుల త్రాగునీటి సౌకర్యానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం

కల్వకుర్తి, ఉరుకొండ, జనవరి 23 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఊరుకొండపేటలో గల శ్రీశ్రీశ్రీ పబ్బతి అంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే నీటి శుద్ధి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రాంనుంతల మాజీ సర్పంచ్ శ్రీ రాములు, దత్తాత్రేయ శర్మ, ప్రవీణ్ శర్మ, ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు వెంకటమ్మ శ్రీనివాసులు, మల్లేష్, దారా బంగారయ్య, ఆంజనేయులు, చంద్రశేఖర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post