సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

 మేడారంలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

సీఎం వచ్చే దారికి మరమ్మతులు పూర్తి

భక్తుల ఇబ్బందులు లేకుండా ప్రత్యేక మార్గం

ములుగు, జనవరి 13 (మనఊరు ప్రతినిధి): సమ్మక్క–సారలమ్మ మహాజాతరను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం నేరుగా హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ మీదుగా దేవస్థానం ప్రధాన ద్వారం వరకు చేరుకునేలా కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గానికి అవసరమైన మరమ్మతు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గతంలో సీఎం రాక సందర్భంగా దారిని భక్తుల క్యూలైన్‌గా మార్చేందుకు ప్రణాళికలు ఉండడంతో దర్శనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల దర్శనాల కోసం ప్రత్యేకంగా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

స్నానఘట్టాలకు పెయింటింగ్ పనులు

మహాజాతరకు మేడారం వచ్చే భక్తుల సౌకర్యాల కోసం స్నానఘట్టాలకు పెయింటింగ్ పనులు. మెట్లు జారకుండా, శుభ్రంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు ఉచిత సరఫరా

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు ఉచితంగా తాగునీరు అందించారు. ఈ అనేక ప్రాంతాల ట్రాక్టర్ల ద్వారా నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి వారు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Previous Post Next Post