అమ్మకానికి గిరిజన పసికందు!

 అమ్మకానికి గిరిజన పసికందు!

సమాచారం అందగానే రంగంలోకి సంబంధిత శాఖలు

శిశువును స్వాధీనం చేసుకున్న అధికారులు

షాద్‌నగర్, జనవరి 13 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ఉప్పరిగడ్డ తండాలో గిరిజన పసికందును అమ్మిన ఘటన కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమై శిశువును స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ పోలీసుల సమక్షంలో అధికారులు శిశువును భద్రతలోకి తీసుకొని, మరికాసేపట్లో శిశు విహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిశువుకు ఎలాంటి హానీ జరగకుండా తగిన సంరక్షణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, పసికందును అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ అమానవీయ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Previous Post Next Post