రెండ్రోజులే అవకాశం…
శివదీక్ష మాలాధారణకు ముగింపు సమయం
4, 5 తేదీల వరకు మాత్రమే శివదీక్ష –
శివభక్తులకు నిర్వాహకుల పిలుపు
జడ్చర్ల, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): మండల శివదీక్ష మాలాధారణకు ఈనెల 4, 5 తేదీల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని శివ దీక్ష సేవ సమితి జడ్చర్ల నిర్వాహకులు శనివారం తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా శివభక్తులందరూ స్వామివారి మాలాధారణ ధరించి శివ స్వాములుగా దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. శివదీక్ష మాలాధారణ వలన భక్తులు మంచిని అలవరుచుకుని చెడును విడిచిపెట్టి, శివస్వామిపై అచంచలమైన నమ్మకంతో దీక్షలు చేస్తే పాడి, పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని గురు స్వాములు పేర్కొన్నారు. సర్వేజనో సుఖినోభవంతు… అందరం బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అనే శుభాశయంతో శివస్వామిని వేడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ శివదీక్ష కార్యక్రమాన్ని ధ్యాసమోని కృష్ణయ్య గురు స్వామి ఆధ్వర్యంలో, బొడ్ల విజయకుమార్ సహకారంతో శివ దీక్ష సేవ సమితి జడ్చర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల శివభక్తులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.





