ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి అసెంబ్లీ ముట్టడికి పిలుపు

 ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి 

 అసెంబ్లీ ముట్టడికి పిలుపు

ఆటో యూనియన్ అధ్యక్షుడు హాజీ అరెస్ట్‌ను ఖండించిన రాష్ట్ర నేతలు

జడ్చర్ల రూరల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): ఆటో యూనియన్ అధ్యక్షుడు హాజీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మరయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రమాద భీమా కింద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నేతలు కొంగలి వెంకటయ్య, ఎండీ అమద్ అలీ, జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ హాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, తమ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Previous Post Next Post