జిల్లా వీరశైవ లింగాయత్ సంఘ అధ్యక్షుడిగా గిరిజశంకర్

 జిల్లా వీరశైవ లింగాయత్ సంఘ అధ్యక్షుడిగా కెంచే గిరిజశంకర్

జిల్లా వీరశైవ లింగాయత్ సంఘ అధ్యక్షుడిగా కెంచే గిరిజశంకర్

నాగర్‌కర్నూలు, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులుగా కెంచే గిరిజశంకర్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు కొండ వీరన్న అధ్యక్షతన గురువారం జరిగిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కెంచే గిరిజశంకర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో సంఘాన్ని ముందుండి నడిపిస్తానని నూతన జిల్లా అధ్యక్షులు కెంచే గిరిజశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post