వీరశైవ లింగాయత్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలి

 వీరశైవ లింగాయత్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలి

 ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొండ వీరన్న పిలుపు

నాగర్‌కర్నూలు, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): వీరశైవ లింగాయత్ సంఘం అభివృద్ధికి నూతనంగా ఏర్పాటైన జిల్లా కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఉమ్మడి జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు కొండ వీరన్న పిలుపునిచ్చారు. జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో నూతన కార్యవర్గం చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొండ వీరన్న అధ్యక్షతన గురువారం జరిగిన కార్యక్రమంలో నాగర్‌కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా కేంచే గిరిజాశంకర్, ప్రధాన కార్యదర్శిగా కే. రాజేష్ కుమార్, కోశాధికారిగా శంకర్, ప్రచార కార్యదర్శిగా బొమ్మిశెట్టి శ్రీనివాసులులను ఎంపిక చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా శివశంకర్, ఆనంద్ కుమార్, శెట్టి ప్రసాద్, రాజశేఖర్, విశ్వనాథం, సహాయ కార్యదర్శులుగా వీరన్న మల్లేష్, వీరేశం, గౌరవ అధ్యక్షులుగా కే. జెమిని సురేష్లను నియమించారు. ఈ నూతన కార్యవర్గం ఈ సంవత్సరం కాలం పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కుల సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాలని, యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసుకోవాలని కొండ వీరన్న సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post