ఘ‌నంగా గాంధీ వర్ధంతి వేడుకలు

 ఘ‌నంగా గాంధీ మహాత్ముడి వర్ధంతి వేడుకలు

జడ్చర్ల రూరల్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి ): నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని బిసి జాగృతి సేన రాష్ట్ర న్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం నియోజకవర్గంలోని పలు డివిజన్‌లలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సత్యాగ్రహం, అహింస సూత్రాలతో శాంతియుత మార్గంలో పోరాటం చేసి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా సోదరభావంతో జీవించాలని ప్రజలకు నిరంతరం బోధించిన మహానీయుడని, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడారని గుర్తు చేశారు. సామాజిక సంస్కరణలు, అంటరానితనం నిర్మూలన కోసం గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీను గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి, కిషోర్ కుమార్, మల్లేష్ యాదవ్, కావలి రామస్వామి, రాధాకృష్ణ, కన్నయ్య, శివకుమార్, గోరంట్ల మల్లేష్, మహేష్, దశరథం, మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post