క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

 తెలంగాణ స్టేట్ బాడీ మందుల కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

జడ్చర్ల రూరల్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ స్టేట్ బాడీ మందుల కుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను జడ్చర్ల మందుల కుల సంఘం తరపున జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మందుల కుల సంఘం సామాజికంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందుల కుల సంఘ నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post