మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు మారనుంది

 మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు మారనుంది

అవినీతిపరులకు ఓటమి తప్పదు

అఖిలపక్ష సర్వేలో తేలింది 

వనపర్తి, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ప్రజల తీర్పు వినూత్నంగా ఉండబోతోందని, అవినీతిపరులను ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎక్కువగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అఖిలపక్ష ఐక్యవేదిక నిర్వహించిన సర్వేలో వెల్లడైందని డాక్టర్ సతీష్ యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఐక్యవేదిక నాయకులు 5వ, 13వ, 20వ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు, మద్యం ప్రలోభాలతో ప్రతిసారి వార్డులు మారుస్తూ గెలిచి మున్సిపాలిటీలో అవినీతి చేస్తున్న నాయకులను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు ఐక్యవేదిక నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వనపర్తి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఐక్యవేదిక నాయకులు, మున్సిపాలిటీలో మాఫీయాగా మారి ప్రజల సొమ్మును కాజేయాలని ప్రయత్నిస్తున్న అభ్యర్థుల వివరాలను ప్రజలకు వివరించారు. ప్రజల స్పందన ప్రకారం, అనవసర పన్నుల భారం తగ్గించి నిజాయితీగా పనిచేసే అభ్యర్థులకే ఓటు వేస్తామని, అవినీతిపరులను తప్పక ఓడిస్తామని ప్రజలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ, పోలింగ్ తేదీ వరకు నిరంతరం పర్యటిస్తూ అవినీతిపరుల వివరాలను ఆధారాలతో సహా ప్రజలకు తెలియజేసి, అవినీతి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ప్రజలు, ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.



Previous Post Next Post