ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఊర్కొండ, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఊర్కొండపేటలో శ్రీ శ్రీ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం రథోత్సవాన్ని దర్శించి భక్తులతో కలిసి స్వామివారి నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఊర్కొండ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి సంప్రదాయాలు, ఉత్సవాలు తరతరాలుగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



