ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
పదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాని యాదవ్..
10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నాని యాదవ్ ఖరారు
ప్రచారాన్ని ముమ్మరం చేసిన నాని యాదవ్
కల్వకుర్తి, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాని యాదవ్ పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే నాని యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా నాని యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ కల్వకుర్తి ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం సేవలు చేశానని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేశానని, ఈసారి 10వ వార్డు ప్రజలు అవకాశం ఇస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 10వ వార్డు ప్రజలు తనను గెలిపిస్తే, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని అన్నారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో 10వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని నాని యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
