గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
మహబూబ్‌నగర్, (ప్రతినిధి): గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను గౌరవ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గంజి వేంకట్రాములు, గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
