బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

 బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

జాతీయ బాలికా దినోత్సవంలో డాక్టర్ సంతోషి భవాని

జడ్చర్ల, జనవరి 24 (ప్రత్యేక ప్రతినిధి): ప్రస్తుత సమాజంలో బాలికలు విద్య, ఉద్యోగం, క్రీడలు, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో రాణించాలని డాక్టర్ సంతోషి భవాని అన్నారు. మండలంలోని కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మారేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ బాలికల సాధికారత, విద్యా ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ సంతోషి భవాని మాట్లాడుతూ కౌమార దశలో బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలపై విలువైన సూచనలు చేశారు. ఉన్నత విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ పాఠశాలలో బాలికలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయ బృందం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బాలికా రక్షణ చట్టాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ పార్వతమ్మ, ఏఎన్ఎం శంకరమ్మతో పాటు ఉపాధ్యాయులు షాహినా పర్వీన్, అనసూయ, ఉమాదేవి, అంజలీదేవి, అమరేందర్ రెడ్డి, శశిధర్, మల్లికార్జున్, తాహెర్, కృష్ణ, బాలచంద్రుడు, కృష్ణయ్య, కర్ణాకర్, గోవర్ధన్, ఆంజనేయులు, శరణప్ప, శ్రీనివాస్ శెట్టి, రవికుమార్, అశోక్, మదన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous Post Next Post