విద్యార్థుల మేధాశక్తి విద్యార్థుల మేధాశక్తి వికాసానికి, మానసిక ఉల్లాసానికి చెస్ పోటీలు దోహదపడతాయి

 పాలెంలో ఘనంగా మండల స్థాయి చెస్ పోటీలు

విజేతలకు నగదు బహుమతులు, మెడల్స్ అందజేత

బిజినేపల్లి, జనవరి 4 (మనఊరు ప్రతినిధి): విద్యార్థుల మేధాశక్తి వికాసానికి, మానసిక ఉల్లాసానికి చెస్ వంటి ఆటలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ బి. పుష్పవతి సూచించారు. మండలంలోని పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణమండపంలో ఆదివారం తోటపల్లి సుబ్బయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అండర్–16 మండల స్థాయి చెస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ బి. పుష్పవతి నగదు బహుమతులు, మెడల్స్, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.‌ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని, చెస్ వంటి మేధో క్రీడలు ఆలోచనా శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మండల స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మండలంలోని 20 పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీల్లో ప్రథమ బహుమతి బిజినపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థి మానస్ కు రూ.5,000 నగదు ద్వితీయ బహుమతి, శశిధం కు రూ.3,000 నగదు తృతీయ బహుమతి, వేదాంశ పాఠశాల విద్యార్థి జునైద్ నవాజ్ కు రూ.2,000 నగదు నాలుగో బహుమతి – బిజినపల్లి బాలుర పాఠశాల విద్యార్థి యాస్మిన్, వడ్డేమాన్ పాఠశాల విద్యార్థులు త్రినేత్ర, వైష్ణవిలకు రూ.1,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అందరు విద్యార్థులకు మెడల్స్‌తో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. పాలెం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పోటీదారులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాడి సురేందర్, మోహన్ బాబు, రఘు బాబు, దీప్తి, వేదాంశ్, మహిపాల్ రెడ్డి, పి. కృష్ణగౌడ్, కోచ్‌లు సంతోషి, గీత, వైష్ణవి, జగదీష్, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






Previous Post Next Post