ఘనంగా సయ్యద్ సలార్ వలియా గందోత్సవం

 సాలార్‌పూర్‌లో ఘనంగా సయ్యద్ సలార్ వలియా గందోత్సవం

పూల చహదర్ సమర్పించిన దశరథ్ నాయక్

కడ్తాల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): మండలంలోని సాలార్‌పూర్ గ్రామంలో సయ్యద్ సలార్ వలియా గందోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. గందోత్సవ కమిటీ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా కడ్తాల్ మాజీ జెడ్పిటీసీ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ సలార్ వలియా దర్గాలో ఆయన పూల చహదర్ సమర్పించారు. అనంతరం దశరథ్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్న సయ్యద్ సలార్ వలియా గందోత్సవం విశేష ఖ్యాతిని సంతరించుకుందని తెలిపారు. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయనే ప్రగాఢ నమ్మకంతో నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారని అన్నారు. కడ్తాల్ మండల ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో ఉండాలని అల్లాను ప్రార్థిస్తూ ఈ గందోత్సవంలో పూల చహదర్ సమర్పించానని తెలిపారు. అల్లా దయవల్ల కడ్తాల్ మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రియా రమేష్, మాజీ ఎంపీపీ సువాలీపంతు, మాజీ ఎంపీటీసీ సాయిలు, మాజీ డైరెక్టర్ లాయక్ అలీ, ఉప సర్పంచ్ మహేశ్వరి, కుమార్, వార్డు సభ్యులు జైపాల్, మల్లేష్, రాములు, రమేష్, నాయకులు బాబా, హంజాద్, తస్లీమ్, మోబిన్, గోపాల్, నషీర్, బైసర్ హుస్సేన్, చరణ్, శివ, అప్సర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.







Previous Post Next Post