శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి త్వరలో మెరుగైన నెట్‌వర్క్‌

 మద్దిమడుగు గ్రామానికి త్వరలో మెరుగైన నెట్‌వర్క్‌

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఎయిర్టెల్ సిగ్నల్ సైట్ పరిశీలన

నాగర్ కర్నూల్, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో త్వరలో మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న ఎయిర్టెల్ సిగ్నల్ సైట్‌ను సంబంధిత అధికారులు శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న సిగ్నల్ సైట్ పనులను పరిశీలించిన అధికారులు, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఎయిర్టెల్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులను రాబోయే 15 నుంచి 20 రోజులలోపు పూర్తిచేసి సిగ్నల్‌ను ప్రారంభించాలంటూ ఆదేశించారు. ఈ సిగ్నల్ సైట్ ఏర్పాటు ద్వారా మద్దిమడుగు గ్రామ ప్రజలకు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు తొలగి, ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ దేశవత్ రాములు నాయక్, ఎస్‌డీఈ దేశావత్ చందు, ఆలయ కమిటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్ల రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బదాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post