ఘనంగా రేణుక ఎల్లమ్మ ఏడోవార్షికోత్సవం
ప్రతి మనిషిలో భక్తిభావన పెంచుకోవాలి
ఆర్య సమాజం నాయకులు
జడ్చర్ల రూరల్, జనవరి 20 (మనఊరు ప్రనిధి): పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని తాలూకా క్లబ్ రోడ్డు గ్యాస్ గోదాం వెనుక భాగంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఏడవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు, అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. హోమం (యజ్ఞం) నిర్వహించడం, మహిళలచే సువాసినులతో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. తదనంతరం మహానైవేద్యం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్య సమాజం ఆధ్వర్యంలో యజ్ఞం జరిగింది. ఆర్య సమాజం అధ్యక్షుడు బక్క రాజు, కోశాధికారి విజయకుమార్, సుధాకర్ మాట్లాడుతూ ప్రతి మనిషిలో భక్తిభావన పెంచుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సత్సంగ కార్యక్రమాలు, సాంస్కృతిక కళా కార్యక్రమాల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి, జగన్ గౌడ్, మధుసూదన్ గౌడ్, శంకర్ గౌడ్, ప్రకాష్ గౌడ్, భరత్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, రమేష్ గౌడ్, గోపాల్ గౌడ్ వంటి. అలాగే నిర్వాహకుడు గోనెల రాధాకృష్ణ, ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి, కళ్యాణి, అనిత, గోపమ్మ, సుజాత, రామలక్ష్మమ్మ, మంజులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో హాజరైన వేడుకలను విజయవంతం చేశారు.

