రాజ్యాంగ పరిరక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యత అవసరం
జడ్చర్లలో జేఏసీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు
జడ్చర్ల, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్రను ఘనంగా నిర్వహించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని స్థానిక ప్రజలకు జేఏసీ సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీసీ–ఎస్సీ–ఎస్టీ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సామాజిక న్యాయం సాధనలో జేఏసీ కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బాలయ్య ముదిరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ప్రసాద్ మహారాజ్, బాలానగర్ మండల జేఏసీ అధ్యక్షుడు మధు, డీఎప్పీ బాలానగర్ కన్వీనర్ రెడ్డ్యా నాయక్, చిల్ల వెంకటేష్, పి. శ్రీనివాసులు, రంగయ్య, రమేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.







