లట్టుపల్లి పీహెచ్‌సీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
జెండా ఆవిష్కరణ చేసిన వైద్యాధికారి డా. టి. ప్రసన్న
బిజినపల్లి, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులతో పాటు ప్రతి ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘన, మహిళా ఆరోగ్య కార్యకర్తలు బొజ్జమ్మ, సుమిత్ర, చంద్రశేఖర్, నగేష్, శశికళ, విజయలక్ష్మి, జ్యోతి, బాలమని, వరలక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


