సంపూర్ణ ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

 2047 నాటికి సంపూర్ణ ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

మానవ ఆయుష్షును 80 ఏళ్లకు పెంచడమే లక్ష్యం

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. టి. ఉషారాణి

నాగర్‌కర్నూల్, జనవరి 26 (ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యుడు, సిబ్బంది బాధ్యత అని అన్నారు. “ప్రతి రోగికి కనిపించే దేవుడు వైద్యుడే. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే, నాణ్యమైన చికిత్స అందించాలి. 2047 నాటికి దేశం నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలను సంపూర్ణంగా సాధించడంతో పాటు, ప్రజల సగటు ఆయుష్షును 80 సంవత్సరాలకు పెంచే దిశగా కృషి చేయాలి” అని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ స్ఫూర్తితో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో ప్రతి వైద్యుడు, నర్సింగ్ అధికారి, క్షేత్రస్థాయి సిబ్బంది తమ వంతు బాధ్యతగా సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు ఉత్తమ సేవలందించిన వైద్యులు, నర్సింగ్ అధికారులు, వివిధ క్యాడర్ల సిబ్బందిని సన్మానించి పురస్కారాలు అందజేశారు. నర్సింగ్ అధికారులకు నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా. వి. శేఖర్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డా. రవిశంకర్, డాక్టర్లు హనుమంతరావు, శైలజ, శాంతి, సిరాజుద్దీన్, శ్రీకాంత్, దశరథం, శకుంతల, సహాద, శంకర్, ఏడి వసంత్‌కుమార్, ఏఓ రామచంద్రయ్య, గాలిబ్, నర్సింగ్ అధికారి ఆనంద్, హెల్ప్‌డెస్క్ ఇన్‌చార్జ్ టి. యాదగిరి, అన్ని విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















Previous Post Next Post