నేటి నుంచి రేణుక ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

 రేణుక ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

భక్తులతో కిటకిటలాడనున్న ఆలయ ప్రాంగణం

జడ్చర్ల రూరల్, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని విద్యానగర్ కాలనీ తాలూకా క్లబ్ లైన్, గ్యాస్ గోదాం వెనుక భాగంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం శుక్ల విదియ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 7:30 గంటల నుండి 9:00 గంటల వరకు భక్తులచే అమ్మవారికి క్షీరాభిషేకం, అనంతరం 9:00 నుండి 9:30 గంటల వరకు అమ్మవారి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. 10:00 నుండి 11:00 గంటల వరకు హోమం (యజ్ఞం) నిర్వహించనుండగా, 11:00 నుండి 11:30 గంటల వరకు మహిళలచే సువాసిని సహిత సామూహిక కుంకుమార్చనలు ఘనంగా జరుగనున్నాయి. తదుపరి మహానైవేదనం, మహామంగళహారతి, అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని రేణుక ఎల్లమ్మ ఆలయ భక్తులు కోరారు.

Previous Post Next Post