పి.ఎం.శ్రీ ఫుట్‌బాల్ కప్ విజేతగా రాజాపూర్ హైస్కూల్

 పి.ఎం.శ్రీ ఫుట్‌బాల్ కప్ విజేతగా రాజాపూర్ హైస్కూల్

మహబూబ్‌నగర్, జనవరి (మనఊరు ప్రతినిధి): పి.ఎం.శ్రీ పథకంలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో రాజాపూర్ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. బాలుర విభాగంలో ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో జిల్లాలోని 24 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పి.ఎం.శ్రీ ఆటల పోటీల్లో ఫైనల్‌కు చేరుకున్న రాజాపూర్ హైస్కూల్ బాలుర జట్టు ఆటోస్ఫూర్తిని ప్రదర్శిస్తూ, చక్కటి సమన్వయంతో ఆడుతూ బాదేపల్లి బాయ్స్ జట్టుపై విజయం సాధించి ఫుట్‌బాల్ కప్‌ను కైవసం చేసుకుంది. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి వెంకటమ్మ, స్పోర్ట్స్ కోచ్ ప్రకాశ్తో పాటు ఉపాధ్యాయ బృందం హర్షాతిరేకాలతో అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర విజేతలుగా నిలవాలని వారు ఆకాంక్షించారు.




Previous Post Next Post