ఘనంగా యోగేంద్ర జి జయంతి ఉత్సవాలు

 ఘనంగా సంస్కార భారతి వ్యవస్థాపకుడు యోగేంద్ర జి జయంతి ఉత్సవాలు 

జడ్చర్ల రూరల్, జనవరి (మనఊరు ప్రతినిధి): సంస్కార భారతి వ్యవస్థాపకుడు యోగేంద్ర జి జయంతి ఉత్సవాలను పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌లో బుధవారం సంస్కార భారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగేంద్ర జి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా ఉపాధ్యక్షులు గోనెల రాధాకృష్ణ మాట్లాడుతూ, సంస్కార భారతికి కీలక పాత్ర పోషించిన వ్యవస్థాపకుడు యోగేంద్ర జి గొప్ప సంస్కారవంతుడని, సంస్కారంతో పాటు దేశభక్తి నిండిన వ్యక్తిగా అనేక మంది కళాకారులను వెలుగులోకి తీసుకువచ్చారని అన్నారు. కళా ప్రదర్శనలు, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణ, దేశభక్తి మరియు సమైక్యతను పెంపొందించడంలో సంస్కార భారతి విశేష కృషి చేసిందని కొనియాడారు. సమాజంలో కళలు, కళాకారులను వెలికి తీయడంలో సంస్కార భారతి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షులు మురళి, సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పుష్పలత, నిఖిత, రజిత, కళావతి, తేజస్విని, సాయి ప్రభ, లలిత, రాజశ్రీ, జయశ్రీ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Previous Post Next Post