ఉద్యానవన పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలి
తలకొండపల్లిలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించింది
ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా
కల్వకుర్తి, తలకొండపల్లి, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): ఉద్యానవన పంటల సాగుపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకొని అధిక దిగుబడులతో ఆర్థిక లాభాలు సాధించాలని ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా సూచించారు. గురువారం తలకొండపల్లి మండలం కోరింతకుంట తండా గ్రామ పంచాయతీలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్‌ను డైరెక్టర్ యాస్మిన్ భాషా ఐఏఎస్ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఘనంగా ఉన్నారు. ఈ సందర్భంగా యాస్మిన్ భాషా ఉద్యానవన పంటలను నాణ్యతతో పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యానవన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలను సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంప్రదాయ పంటలతో పాటు ప్రభుత్వం ప్రోత్సాహకాలను వినియోగించుకొని అధికారుల సూచనల మేరకు ఉద్యానవన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు.
ఉద్యానవన పంటలపై ఒక రూపాయి పెట్టుబడి పెడితే నాలుగు రూపాయల వరకు లాభం పొందవచ్చని భావిస్తున్నారు. అలాగే సెరికల్చర్ పంటలు తక్కువ కాలంలో చేతికి వచ్చి సరైన సంరక్షణ చేస్తే అధిక ఆదాయం సాధ్యమవుతుంది. ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, రైతుల సూచనలను పరిగణలోకి తీసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ పామాయిల్ పంటను ఒక్కసారి నాటితే 30 సంవత్సరాల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయిల్ ఫామ్ పామే కుటుంబానికి చెందిన మొక్కగా ఉండి, దీని నుంచి తీసే పామాయిల్ ప్రస్తుతం వంటనూనెల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పామాయిల్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల మండలాలకు 1500 యూనిట్ల స్ప్రింక్లర్లకు కృషి చేయాలని కోరారు. ఉద్యానవన పంటలలో మామిడి, జామతో పాటు పామాయిల్ సాగుపై రైతులు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.







