ఖిల్లా సేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కళ్లజోడు, మందుల పంపిణీలో పాల్గొన్న ఆగారం ప్రకాష్
ఖిల్లా ఘనపూర్, జనవరి 4 (మనఊరు ప్రతినిధి): ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ఖిల్లా సేవ సమితి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా కళ్లజోడు మందుల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రగిరి పెద్ది రాజు, కొరిగేలా గోపి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు మండల నాయకులు ఆగారం ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కళ్లజోడు, మందుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న పెద్ది రాజు, కొరిగేలా గోపిలను ఆగారం ప్రకాష్ శాలువాతో సత్కరించారు. ఉచిత కంటి వైద్య శిబిరం, కళ్లజోడు పంపిణి ద్వారా ఎంతో మందికి చూపును అందిస్తున్నారని ప్రశంసించారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని, పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి సేవా కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆగారం ప్రకాష్ తెలిపారు. సేవా పథం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
