నిజాయితీ జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం యాదిలాల్
మహబూబ్‌నగర్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): నిజాయితీ, నిబద్ధతతో కూడిన జర్నలిజానికి నవాబుపేట ‘దిశ’ రిపోర్టర్ కె. యాదిలాల్ జీ నిలువెత్తు నిదర్శనమని టీడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్) నాయకులు కొనియాడారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదిలాల్‌ను శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… యాదిలాల్ తన కలం ద్వారా ప్రజా సమస్యలను నిస్వార్థంగా పాలకుల దృష్టికి తీసుకెళ్తూ, యువ పాత్రికేయులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. జర్నలిజంలో విలువలు, బాధ్యతలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యానికి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర నేతలు సోమయ్య, బండి విజయ్ కుమార్, జిల్లా నాయకులు అశోక్ కుమార్, గోపాల్, యాదగిరి, రఫీక్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
